వరంగల్ అర్బన్: జిల్లాలోని, వరంగల్ మహా నగరంలోని ఓల్డ్ ఫర్నిచర్ షాప్ లో యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం చేయడంతో ప్రభుత్వానికి పన్ను చెల్లించే కొన్ని షాపులు మూల పడే అవకాశం ఏర్పడుతుంది. రోజుకు లక్షల్లో తమ వ్యాపారం జరిగిన కనీస అనుమతులు లేని షాపులే సగానికి పైగా ఉన్నట్ల సమాచారం. రాత్రికి రాత్రే లారీల కొద్దీ సరుకులు ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. జీరో దందా వ్యాపారంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. రహదారిపై రోడ్డు ఆక్రమించి వ్యాపారులు కొనసాగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పటి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతం బూడిద గడ్డగా ప్రచారంలో ఉండేది. తదనంతరం రోజువారీగా ఇక్కడ ఇసుక విక్రయ కేంద్రంగా ఏర్పడి ఇసుక అడ్డాగా మారింది. ఆ తదనంతరం ప్రస్తుతం పాత దర్వాజాలు అడ్డాగా మారింది. అది ఏ స్థాయిలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇక్కడి నుంచి సరఫరా అయ్యేంత వ్యాపార కేంద్రంగా మార్పు చెందింది. పాత దర్వాజాలు అడ్డా నుంచి జిల్లా నలుమూలన రంగశాయిపెట్, నర్సంపేట రోడ్డు హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.

సుమారుగా జిల్లాలో 40కి పైగా ఓల్డ్ ఫర్నిచర్ షాప్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పాత ఇల్లు తీసి కొత్త నిర్మాణాలు చేపట్టే క్రమంలో తీసిన దర్వాజాలు కిటికీలు సెకండ్ క్లాస్, క్లారిటీ కింద అనుకోవచ్చు కానీ ఇక్కడ అలా జరగడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న సమస్య. హైదరాబాద్, విజయవాడ, ముంబై ఇతర రాష్ట్రాల నుంచి అపార్ట్మెంట్లు పురాతన భవనాలు తొలగించే క్రమంలో వచ్చే కాకుండా వీటిని తయారుచేసే ఫర్నిచర్ కూడా విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటివి విక్రయాలు చేయాలంటే ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ తో పాటు విజిలెన్స్ అధికారులు, అటవీశాఖ అధికారులు, ఐటీ అధికారులు పరిమితులతో అక్రమ విక్రయాలు జరగాలి. కానీ ఇక్కడ అలాంటివి బిల్లు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యాపారం జరగడంతో సంబంధిత అధికారులు చేతివాటానికి అలవాటు పడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, వ్యవహారంపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.