బుచ్చన్నపేట: గ్రామంలో అందరికి ఆదర్శముగా ఉండాల్సిన సర్పంచ్ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో గ్రామస్థులు సర్పంచ్ ను చితకబాదారు. ఈ ఘటన జనగామ జిల్లా బుచ్చన్నపేట మండలం కొన్నే గ్రామ సర్పంచ్ వేముల వెంకటేష్ గ్రామం లోని ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

విషయం తెలిసిన గ్రామస్థులు మహిళ బంధువులు కార్ లో వెళుతున్న వేంకటేష్ ను అడ్డుకుని రోడ్డు పైనే కొట్టారు. సర్పంచ్ ను కొట్టిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. సర్పంచ్ ను కొట్టిన సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే సర్పంచ్‌పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి పని చేసారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.