సమాజం ఎటు పోతుంది మహిళా దినోత్సవం రోజే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు.? ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం గోపాల్ నగర్ గ్రామంలో జరిగింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గ్రామం ప స్తం తిరుపతయ్య వెంకటమ్మ (కులం బేడ బుడగ జంగం ఎస్సీ) 3వ కూతురు అనిత చెన్నూరి రవీందర్ నివాసం గోపాల్ నగర్ (బ్రతుకు తెరువు కోసం చేర్యాల, ముస్తాయల్) అనే వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేయడం జరిగింది ఇద్దరు కొడుకులు పుట్టారు. వక్ర బుద్ధి ఉన్న భర్త భార్య మీద అనుమానంతో హింసలు పెట్టడం మొదలుపెట్టాడు.

పలుమార్లు పెద్దమనుషులలో బుద్ధి చెప్పిన మారని వైనం, అత్తగారి ఇంటికాడ భర్త హింసిస్తున్నాడు కొడుతున్నాడు అని తల్లి గారి ఇంటి దగ్గర కు వస్తే ఫోన్లో కూడా వదలకుండా ఇష్టమొచ్చినట్టు ఫోన్ చేసి ఫోన్ లో బూతు మాటలు తిడుతూ హింసిస్తూ పలు మార్లు తల్లి దండ్రులకు చెప్పుకుంది. ఈరోజు మంగళవారం 08-03-2022 మనస్థాపానికి గురైన ఆ మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న విషగుళికలు మింగి ఆత్మ యత్నం చేసుకుంది. చూసిన బంధువులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పాపం ఆ ప్రాణం పోయింది.