వర్దన్నపేట పట్టణ కేంద్రంలో మున్నురుకాపు కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి సంబందించిన ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులు, మున్నూరుకాపు సంఘ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారికి మున్నూరుకాపు కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.