ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి పర్యాటక ప్రాంతం చూసేందుకు బైక్ పై వెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వారిద్దరినీ ఓ ఇద్దరు వ్యక్తులు చూశారు. అంతే వారిలో ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు కూడా. వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. వీడియో తీస్తూ నానా మాటలు అన్నారు. ఆ కుర్రాడి వద్ద నుంచి ఫోన్ ను లాగేసుకున్నారు. అతడి బైక్ టైర్లలోని గాలి తీసేశారు. ఆ తర్వాత ఆ యువతిని తమ బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేశారు. వీడియో కూడా తీసుకున్నారు. ఎవరికైనా చెబితో సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. అయితే ఆ యువకుడు కాస్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని పర్యాటక ప్రాంతమయిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ అటవీ ప్రాంతానికి సందర్శకులు విపరీతంగా వస్తుంటారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తారీఖున ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి ఆ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. బైక్ పై అక్కడకు వచ్చిన ఆ జంటను చూసిన బొట్టాయిగూండెంకు చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగామ ఆనందరావు దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఆ యువకుడిని కొట్టారు.

అతడి వద్ద నుంచి ఫోన్ ను లాగేసుకున్నారు. అతడి బైక్ లో గాలి తీసేశారు. ఆ తర్వాత ఆ యువతిని తమ బైక్ పై ఎక్కించుకుని మణుగూరుకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో యువతిని బెదిరించి భయపెట్టి సాత్విక్ అత్యాచారం చేశాడు. ఆనందరావు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. యువతికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో వాళ్లు భయపడిపోయారు. ఆమెను బైక్ పై స్వగ్రామంలో దించేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ, చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. కానీ యువితి స్నేహితుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. వారికి రిమాండ్ విధించారు.