హన్మకొండ: ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వరంగల్ లోకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మా ఉత్సవ్ 2020 శనివారంతో విజయవంతంగా మూడో రోజు స్థానిక ఫార్మసి కళాశాలల్లో వివిధ రకాల క్రీడలు విజ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలతో విజయవంతంగా జరుగుతున్నాయని సదస్సు కన్వీనర్ డా. శ్రీధర బాబు తెలిపారు.

ఈ క్రీడా పోటీలలో మూడవరోజు ఆరేపల్లి సమీపంలో గల సహస్ర ఫార్మసీ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహించామని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి డాక్టర్ రఘునందన్ హాజరై మాట్లాడుతూ:

ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ఇందులో భాగంగా ఒక్కో కళాశాలలో ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నామని క్విజ్ పోటీలలో నిర్వహించిన ఈ పోటీలలో మొత్తం 20 టీములు పాల్గొనగా అందులో బాలాజీ, సహస్ర కళాశాలల విద్యార్థులు గెలుపొందార క్విజ్ నిర్వాహకుని లు తెలిపారు. ఈ ఉత్సవ్ రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారని, ఐపిఎ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.