ఈ రోజు వరంగల్ లో కాశీబుగ్గలోని సాయి గణేష్ కాలనీ వాసులు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు ని కలవడం జరిగింది .ఈ సందర్భంగా కాశీబుగ్గలోని సాయి గణేష్ కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా వాటిని మరమ్మతు చేయాలని కాలనీ వినతిపత్రాన్ని మేయర్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని కార్పోరేటర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని నీటి సమస్య ,విధీ దిపాల సమస్య , డ్రైనేజీ,సిసి రోడ్లు ,కాలనీలో ఇంట్లో చెత్త తిసుకెళ్లడంలో జాప్యం మరియు మెరీలను అపరిశుభ్రంగా వుంచడం వంటి వాటిని మెయర్ దృష్టికి తిసుకెళ్ళడం జరిగింది .ఈ కార్యక్రమంలో కాలనీ అడ్వైజరీ అధ్యక్షులు మోటే చిరంజీవి, కాలనీ వాసులు కందకట్ల రమేష్ , శ్రీరామోజు కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .