ములుగు: మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన పోరిక లచ్చు కూతురు పోరిక కవిత (22) ఈ నెల 20 రాత్రి 9 గంటలకు అన్నం తిని పడుకుని మరుసటి రోజు ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి మంచంపై లేదు. చుట్టుప్రక్కల అంతటా, బంధువుల ఇండ్లలో వెతికినా ఎక్కడ ఆచూకీ కనబడక పోయేసరికి శుక్రవారం పోరిక లచ్చు ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ములుగు 2వ ఎస్సై ఫణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.