యూట్యూబ్ డాక్టర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. హన్మకొండ సిటీ ఆస్పత్రి ఘటనపై డీఎంహెచ్ఓ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ మాఫీయా అసలు సూత్రధారిని కాపాడేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్ అబార్షన్స్పై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. యూట్యూబ్ డాక్టర్ స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఎలాంటి అర్హతలు లేకున్నా ఓ యువకుడు ఇంద్రారెడ్డి బీఎస్సీ చదివి యూట్యూబ్ చూసి డాక్టరుగా అవతారమెత్తాడు. చట్ట విరుద్దంగా అబార్షన్లు చేయసాగాడు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ వైద్యుడి బాగోతంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైంది. దీంతో పోలీసులు నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు. కాగా ఇంద్రారెడ్డి స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యాడు.