నాగబాబు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో మానేసి హాయిగా మరో ఛానెల్లో షో చేసుకుంటున్నాడు. అక్కడితో ఆగకుండా జబర్దస్త్ వెనక నిజాలు అంటూ మరో షో కూడా మొదలుపెట్టాడు. తన అఫీషియల్ ఛానెల్లో మల్లెమాల గురించి కొన్ని మాటలు చెబుతున్నాడు ఈ మెగా బ్రదర్. జబర్దస్త్ కామెడీ షో గురించి మనకు తెలియని నిజాలు చాలానే చెబుతున్నాడు నాగబాబు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో జరిగిన మరో ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు ఈయన. అప్పట్లో జబర్దస్త్ కామెడీ షోలో రచ్చ రవి కూడా తనదైన శైలిలో స్కిట్స్ చేసి నవ్వించాడు. చమ్మక్ చంద్ర టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత సొంతంగా బయటికి వచ్చి టీం లీడర్ కూడా అయ్యాడు రవి.

!! నాగబాబు ! రచ్చ రవి !!

చాలా ఏళ్ళ పాటు రచ్చ రవి పిచ్చపిచ్చగా నవ్వించాడు కూడా. ఇక అప్పట్లో జరిగిన ఓ ఇష్యూ గురించి నాగబాబు ఇప్పుడు స్పందించాడు. అప్పట్లో జబర్దస్త్ షో చేస్తున్నపుడే రచ్చ రవికి యాక్సిడెంట్ అయింది. అందులో మనోడికి గాయాలు కూడా బాగానే అయ్యాయి. జబర్దస్త్ టీం అంతా కలిసి రవికి ఆర్థిక సాయం కూడా చేసారు. ఇప్పుడు ఆ ప్రమాదం గురించి మనసు విప్పి మాట్లాడాడు నాగబాబు. తాము జబర్దస్త్ షో చేస్తున్న సమయంలోనే రవికి యాక్సిడెంట్ అయిందనే వార్త వచ్చిందని వెంటనే అతన్ని అక్కడే దగ్గర్లో ఉన్న అపోలోలో జాయిన్ చేసారని అప్పుడు తాను వెళ్లి చూసానని చెప్పాడు నాగబాబు.

!! చమ్మక్ చంద్ర ! రచ్చ రవి !!

మీరు వచ్చి చెప్తే ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పడంతో అప్పట్లో తాను కూడా వెళ్లి హాస్పిటల్లో చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు ఈయన. అప్పటికే రవి స్పృహలో లేడని కానీ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలిపాడు. రవి యాక్సిడెంట్ తర్వాతే జబర్దస్త్ కమెడియన్స్ కోసం ప్రత్యేకంగా ఓ సహాయనిధి ఏర్పాటు చేసాడు నాగబాబు. ఎవరికి సాయం కావాల్సి వచ్చినా కూడా అప్పట్నుంచి అంతా కలిసి డబ్బులు ఇవ్వడం అలవాటు చేసుకున్నట్లు చెప్పాడు మెగా బ్రదర్. మొత్తానికి జబర్దస్త్ కామెడీ షోలో ఎన్నో మరిచిపోలేని అనుభూతులు ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు ఈయన.