వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు కొండపలకల సారయ్య, లచ్చమ్మ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.1500 కోసం అవస్థలు పడ్డారు. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కతుర్తిలోని బ్యాంకులో నగదు తెచ్చుకునేందుకు సైకిల్‌పై వెళ్లారు. అరవై ఏళ్ల వయసున్న సారయ్య తన భార్యను సైకిల్‌పై కూర్చోబెట్టుకొని మండుతున్న ఎండలో నెట్టుకుంటూ తీసుకెళ్లారు. డబ్బులు తీసుకొని హసన్‌పర్తి, గంటూర్‌పల్లి మీదుగా కేశవాపూర్‌కు చేరుకున్నారు.