ములుగు: మండలంలోని మల్లంపల్లికి చెందిన వడ్ల శంకర్(55) కటాక్షపూర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 కి కాల్ చేయగా ఆంబులెన్స్ లో ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.