హీరో నిఖిల్ వరంగల్ రోడ్ల ఫై రాయల్ ఎంఫిల్డ్ బైక్ ఫై హల్చల్ చేసాడు. త్వరలో విడుదల కానున్న ‘అర్జున్‌ సురవరం’ సినిమా హీరో నిఖిల్‌ ఆదివారం సాయంత్రం వరంగల్‌ నగరంలో సందడి చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏషియన్‌ శ్రీదేవి మాల్‌కు వచ్చారు.

నిఖిల్‌ స్వయంగా సినిమా టికెట్లు విక్రయించారు. అనంతరం కన్నె కన్నె అనే వీడియో పాటను విడుదల చేశారు. విలేకరులతో మాట్లాడుతూ అర్జున్‌ సురవరం చిత్రాన్ని ఆదరించాలని కోరారు. నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒకింత తోపులాట జరిగింది. నిఖిల్‌ ఎడమ కాలు చర్మంపై చిన్న గాయమైనట్లు తెలిసింది. చిత్ర దర్శకుడు టి.ఎన్‌.సంతోష్‌ తదితరులున్నారు.

కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిఖిల్ వరంగల్ లో ఏర్పటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. వరంగల్ నగరంలో ఎంతో ఫేమస్ అయినా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత బైక్ ఫై ర్యాలీ గా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. నిఖిల్ ఒక్కసారిగా రోడ్ ఫై కనిపించేసరికి జనాలంతా తమ కెమెరా ఫోన్లకు పని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.