ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్నింటిపై సడలింపులనిచ్చింది. దీంతో రోడ్లపైకి వాహనాలు పెరిగాయి. అంతేకాదు మద్యం షాపులు తెరవడంతో ఇన్నాళ్లు ఆగిన క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది.

తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. కేయూ పీఎస్‌ పరిధిలో హిజ్రా దారుణ హత్యకు గురైంది. సురేష్‌ అనే కారు డ్రైవర్‌ హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రా హారిణి సురేష్‌ను లైంగిక వేధింపులకు గురిచేయడంతోనే భరించలేక కత్తితో పొడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే సురేష్ హిజ్రా హరిణిని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.