వరంగల్ లో గౌడ బార్ షాప్ అర్ధరాత్రి వరకు తెరచి ఉండడం వలన అక్టోబర్ 16న అల్లావుద్దీన్ ను హత్య చేశారని, గౌడ బార్ పై చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు అల్లావుద్దీన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నగరంలో అనేక బార్ లు , వైన్ షాప్ లు అర్ధరాత్రి వరకు తెరచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ల పై మహిళలు వెళ్లాలంటే భయబ్రాంతులు చెందుతున్నారని, అన్నారు. గౌడ బార్ పై చర్యలు తీసుకోవాలని, అల్లావుద్దీన్ హత్యకు బార్ అర్ధరాత్రి వరకు తెరచి ఉండడం వలనే హత్య చేశారని ఆరోపించారు.