రైలు పట్టాలపై అనుమానాస్పద మృతి

కాశిబుగ్గ 18వ డివిజన్ వివేకానంద కాలనీకి చెందిన రామ లక్ష్మణ్ – చైతన్యల కుమా రుడు కృష్ణప్రసాద్ ( 25 ) వంచనగిరి రైల్వేగేట్ సమీపంలో రైలు కిందపడి మృతి చెందడంతో కాశిబుగ్గ వివేకానంద కాలనీలో విషాదం అలుముకుంది . మృతుడి తండ్రి లక్ష్మణ్ కుట్టు మిషన్ రిపేరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటారు . వారికి ఒక కూతురు , ఒక కుమారుడు ఉన్నారు ఇటీ వల కూతురు పెళ్ళి చేశారు .

కుమారుడు రామా గ్యాస్ కృష్ణప్రసాద్ బీటెక్ పూర్తిచేసి నగరంలోని సోలార్ సర్వీసెస్ ఇంజనిరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు . ఈ క్రమంలో కుమారుడు కృష్ణప్రసాద్ గురువారం సాయంత్రం : తం కృష్ణప్రసాద్ ( ఫైల్ ) తన మిత్రుడి వివాహనికి వెళ్తున్నానని చెప్పి గురువారం రాకపోగా , శుక్రవారం తెల్లవారేస రికి రైలు కిందపడి చనిపోయాడని స్థానికులు తెలపడంతో తల్లితండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి . ఘటనాస్థలిలో మృతుడి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు …