కార్మికులకు రావలసిన కనీస వేతనం రూ . 18 వేలు 10 సంవత్సరాల బకాయి వేతనం , 8 గంటల పని , పిఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని లేబర్ కమీషనర్ ఫిర్యాదు చేసినందుకే హోటల్ యజవూన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కార్మికుల న్యాయమైన డిమాండ్లను హోటల్ యాజమాన్యం పరిష్కరించే విధంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ల్యాండ్ మార్కు , హోటల్ ముందు నక్కలగుట్ట హన్మకొండలో ధర్నా కార్యక్రమం జరిగింది . ఏకశిలా పార్కు నుండి నిరసన చేస్తున్న హోటల్ కార్మికులకు మద్దతు తెలుపడానికి విచ్చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ హోటల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ అమలుకై చేస్తున్న కార్మికుల పోరాటాలకు , ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ 8 నెలలుగా కుల సమస్యలను పరిష్క కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న ఆందోళన యజమాన్యం వారు స్పందించక పోవడం శోచనీయమని గత 10 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికుల హక్కులు అడిగినందుకే పని నుండి తొలగించడం తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత లేబర్ అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం కోసం అధికారులతో మాట్లాడి 3 రోజులలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మేమే ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు .

ఈ కార్యక్రమం అనంతరం సీఐటీయు ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ హోటల్ యజమాన్యం వారికి గత 3 నెలల నుండి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ నోటీస్ ఇప్పించినప్పటికీ యజమాన్యం వారు పరిష్కరించకపోగా కార్మికులను బలవంతంగా వారికి రావాల్సిన లావాదేవీలన్ని ముట్టినట్లు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేయడం , కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లుగానే భావించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో 3 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ యజమాన్యం వారు వాయిదాలు కోరడమే తప్ప , కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని గత 10 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించి వీరి సానంలో బయటి నుండి కొత్తగా కార్మికులను తీసుకువచ్చి పని చేయించుకోవడం లేబర్ చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని చట్టాన్ని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న యజమాన్యం పై కార్మిక శాఖపరమైన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేసే విధంగా డిప్యూటీ కమిషనర్ లేబర్ అధికారి వ్యవహరించాలని లేని యెడల జిల్లావ్యాప్తంగా హోటల్ కార్మికులందరిని ఐక్యం చేసి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు యు . నాగేశ్వర్ రావు , సిహెచ్ . ప్రేమ్ సాగర్ , కె . శరత్ , రజనీకాంత్ , రాకేష్ , పి . కిట్సు పి . పద్మ , ఎస్ . పద్మ , కె . రాము , కె . నాగరాజు , వి . ప్ర సాద్ తొలగించిన కార్మికులు పాల్గొన్నారు .