{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595347369698","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595347250814","source":"other","origin":"unknown"}

వరంగల్: వాస్తవాలు మాట్లాడితే మావోయిస్టులు ఉలికిపడుతున్నారని మంగళవారం ములుగు జిల్లా ఎస్పి సంగ్రాం సింగ్. జి. పాటిల్ అన్నారు. మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన కరపత్రాలపై ఆయన స్పందిస్తూ మాట్లాడారు. ములుగు జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మావోయిస్టుల అసాంఘిక కార్యకలాపాలపై డిజిపి మీడియాతో మాట్లాడిన విషయాల పట్ల ఉలిక్కిపడిన మావోయిస్టులు మహేష్ అనే వ్యక్తి పేరిట ఈనెల 20 న ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రాన్ని విడుదల చేసిన మహేష్ అనే వ్యక్తి ఎవరో అతని హోదా ఏమిటో ఎవరికి తెలియదని, కానీ మావోయిస్టు అగ్ర నాయకత్వం మాత్రం ఎవరెవరి పేరుతోనో కరపత్రాలను విడుదల చేస్తూ వ్యాపారస్తులను, ధనవంతులను బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారు.

నిజాలు మాట్లాడితే ఉలికిపాటు ఎక్కువ. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకపు గిరిజనులను కాల్చి చంపడం, కాంట్రాక్టర్లను బెదిరించడం కొత్తేమీ కాదు. మావోయిస్టు పార్టీలో మహిళలను శారీరకంగా హింసించడం తట్టుకోలేక విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం అవాస్తవమా అని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ యంత్రాలను దగ్ధం చేయడం, కాంట్రాక్టర్లను హతమార్చడం, కార్మికులను వేధించడం లాంటివి కొన్ని దశాబ్దాలుగా మావోలు అనుసరిస్తున్న పద్ధతే అని అందరికీ తెలుసు. ఈ విషయాలనే డీజీపీ మీడియాకు తెలిపారన్నారు.