భారత చట్ట ప్రకారం రెండో పెళ్లి చేసుకోవాలి అని ఉంటే మొదటి భర్తకు లేదా భార్యకు విడాకులు ఇవ్వాలి. కానీ ఓ వివాహిత మాత్రం తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే : వరంగల్ జిల్లాకి చెందినా ప్రశాంత్ మరియు రాధిక ఐదేళ్ళ కింద ప్రేమ వివాహం చేసుకున్నారు . అయితే ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రాధిక కూడా జాబు చేస్తానని చెప్పడంతో దానికి ప్రశాంత్ కూడా ఒకే చెప్పడంతో ఆరు నెలల నుండి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ బ్యాంకులో జాబు చేస్తూ హాస్టల్ లో ఉంటుంది . ఇలా కొన్ని రోజులు బాగానే ఉన్నా అ తర్వాత రాధిక ప్రశాంత్ తో మాట్లాడడం మానేసింది .

దీనితో ప్రశాంత్ రాధిక ఉంటున్న హాస్టల్ కి వెళ్ళాడు కానీ అక్కడ రాధిక లేకపోవడంతో ఆమె పనిచేస్తున్న బ్యాంకు దగ్గరికి వెళ్లి ఆరాదీయగా ఆమె అదే బ్యాంకులో పనిచేసే శివకుమార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటున్నట్లు తెలిసింది . అయితే ప్రశాంత్ తన భార్య మిస్ అయిందని మిస్సింగ్ కేసును పెట్టగా అతనికి విస్తుపోయే నిజం తెలిసింది . తానూ శివకుమార్ ని పెళ్లి చేసుకున్నానని పేర్కొంది రాధిక దీనితో ప్రశాంత్ రాధిక పై పలు కేసులను పెట్టడంతో రాధిక మరియు శివకుమార్ లను అరెస్ట్ చేసారు పోలీసులు..