NPDCL కార్పోరేట్ కార్యాలయంలో ఈరోజున అన్-మ్యాన్డ్ వర్కర్స్ , స్పాట్ బిల్లర్స్ , బిల్ కలెక్టర్స్ మొత్తం 170 మందికి CMD శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ. ఈ సందర్భంగా సి.యం.డి శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు మాట్లాడుతూ: కరోనా విపత్తుకర సమయంలో విద్యుత్ శాఖలో పని చేయుచున్న అమ్యాన్డ్ వర్కర్స్ , స్పాట్ బిల్లర్స్ , బిల్ కలెక్షన్ వర్కర్స్ కి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారికి అండగా నిలిచామని అన్నారు. ఈ కష్ట కాలంలో వారికి తమ వంతు సహాయం చేశామని తెలిపారు .

ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహయం చేయాలని పిలుపునిచ్చారు, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని వారికి సహాయం చేయడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు . కరోనా వ్యాపి రోజు రోజుకి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ , భౌతిక దూరం పాటించాలని , లాక్ డౌన్ నియమ నిబంధనలు తూచాతప్పకుండ పాటించాలని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ అందిస్తున్న ఘనత ప్రతి ఒక్క ఉద్యోగికి దక్కుతుందని అన్నారు .

విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడుతూ:

ప్రతి ఒక్కరు విద్యుత్ బిల్లులను ఆన్లైన్ లో చెల్లించాలని కోరారు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మరాదని అన్నారు. అలాగే కేంద్రం చేయబోయే విద్యుత్ సంస్కరణల వల్ల ఎన్‌పీడీసీఎల్ వంటి సంస్థలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్రం విధానాల వల్ల విద్యుత్ రంగ సంస్థలు కష్టాల్లోకి నెట్టబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (HRD) శ్రీ బి.వెంకటేశ్వర రావు, డైరెక్టర్ (IPC & RAC) శ్రీ పి.గణపతి, డైరెక్టర్ (OPERATION) శ్రీ డి.నర్సింగ రావు, డైరెక్టర్ (COMMERCIAL) శ్రీమతి పి.సంధ్యా రాణి, డైరెక్టర్ (PROJECT) శ్రీ పి.మోహన్ రెడ్డి గార్లు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నార్ల యాదగిరి, సి.జి.యంలు: వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, ఎ.నగేష్ , కె.తిరుమల్ రావు, టి.మధుసూదన్, బి.అశోక్ కుమార్, కె.కిషన్, టి.సదర్ లాల్, అశోక్ గార్లు.| జియంలు: కె.గిరిధర్, శ్రీ కృష్ణ, శ్రీనివాస్, శివరాం, వేణుబాబు, కృష్ణమోహన్ గార్లు, వరంగల్ ఎస్.ఈ రాజు చౌహాన్, డి.ఈలు: టౌన్ హుస్సేన్ నాయక్, రాజం, ఎ.డి.ఈ నార్ల సుబ్రమణ్యేశ్వర రావు గారు తదితరులు పాల్గొన్నారు .