వరంగల్ పోలీసు కమిషనరేట్ అడి షనల్ డీసీపీగా కె.పుష్ప సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో అదనపు ఎస్పీగా ఉన్న ఆమెను అడిషనల్ డీసీపీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం వరంగల్ సీపీ కమిషనర్ ప్రమోద కుమార్ ని మార్యదపూర్వకంగా కలిశాక బాధ్యతలు స్వీకరించారు. 2018 లో డీఎస్పీగా పోలీసు శాఖలోకి ప్రవేశించిన పుష్ప శిక్షణ అనంతరం సీఐడీ సైబర్ క్రైం విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. కల్వకుర్తి డివిజన్ పోలీసు అధికారిగా పనిచేశాక పదోన్నతిపై అదనపు డీసీపీగా డీజీపీ కార్యాలయంలో పనిచే శారు. ప్రస్తుతం వరంగల్ లో అదనపు డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.