వరంగల్, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఏరియాలలో నిర్వహించబోతున్న వినాయక నిమజ్జనాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని ఎస్సై కొమురవెల్లి సూచించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో నేడు గణేష్ మండపాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండపాల దగ్గర డీజే లు, డప్పులు, మైకులు, టపాకాయలు కాల్చడం, లైటింగ్స్, కోలాటాలు, డాన్సులు చేయకుండా, ప్రశాంతంగా, త్వరితగతిన పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలు వస్తే యజమానులు భద్రత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.