వరంగల్‌: వివాహితను వేధించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ జూపల్లి వెంకటరత్నం సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ వీధిలో నివాసం ఉండే ఓ మహిళ భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, కొంత కాలం క్రితం మానుకోట మండలంలోని మాధవాపురం గ్రామానికి చెందిన తొడుసు రాకేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో సదరు వివాహితతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఆమె టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.