విశాఖ శారద ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పాత్రికేయులను ఆత్మీయ్యంగా కలుసుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 2004 నుంచి శారదా పీఠం అనుబంధం వరంగల్ కి ఉందని గుర్తు చేశారు తన హిందు ధర్మ ప్రచార యాత్ర గురించి కులంకుశంగా వివరించారు. దేశంలోనే హిందువుల పండగలు కుటుంభం కుటుంభం జరుపుకునే రాష్ట్ర తెలంగాణ అని నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ పండుగ ఇలా చాలా ఉన్నాయని తన ప్రచారంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో మారు మూల గ్రామాలు కూడా పర్యటిస్తూ హిందు ధర్మ యాత్ర కొనసుగుతుంది,

అని శారదా పీఠానికి 2004 నుండి భక్తులుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీ కాంత్ రావు కుటుంబాన్ని స్వామి గుర్తు చేశారు మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నర్సింహ రావు గారు వంగర గ్రామంలో ఆలయ ప్రారంభించడానికి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి ఆహ్వానించిన నాటి నుండి ఈ ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది అని స్వామి వారు ఇప్పుడు వరంగల్ పర్యటన ఉన్న తను కూడా తమ గురువు స్వరూపానంద సరస్వతి గారితో వచ్చినపుడు ఎలక్ట్రానిక్ మరియు ప్రెస్ మీడియా మిత్రలతో తమలు అనుబంధం ఉందని తెలియజేసారు.

ఇదే క్రమంలో స్వామి వారిని ప్రెస్ మిత్రులు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు ఒక ప్రెస్ మిత్రుడు కశ్మీర్ ఆర్టికల్ 370 గురించి రద్దు అయ్యింది కదా దాని గురించి అభిప్రాయం అడగగా ఆసక్తిగా సమాధానం చెప్పారు తను చాలా చిన్న వాడినని ఆయన దేశం మొత్తం ఐక్యంగా ఉండేందుకు చాలా పొరాటలు జరిగాయి అని ఇప్పుడు ఆ అవసరం ఇక ఉండదని ఇప్పుడు దేశం అభివృద్ధి కోసం మాత్రమే యుద్ధం చెయ్యాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు మరియు స్వామి వారి రెండు రాష్ట్రాల సమన్వయ కర్త చెరుకు కరణ్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాల సమన్వయ కర్తలు రాంమూర్తి పోలపల్లి, రోహిత్, శ్రీను ఇతర ప్రముఖ ప్రెస్ మీడియా మిత్రులు పాల్గొన్నారు అనంతరం అందరికి స్వామి వారు ప్రసాదాలు అందచేసారు.