15 నిమిషాలలో లొకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలింపు

మండలానికి సంబంధించిన 19 సంవత్సరాల యువతి హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ప్రైవేట్ జాబ్ చేస్తుంది అదే గ్రామానికి చెందిన తనతో పాటు చదువుకున్నా పరిచయస్తుడు, క్లాస్మేట్ అయిన సంపత్ అనే వ్యక్తితో కలిసి ఈరోజు ఆమెకు సెలవు దినం కావడంతో ఆమె సికింద్రాబాద్ నుండి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమె దగ్గరికి వెళ్లి తన తోటి రావాల్సిందిగా తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధింపులకు గురిచేసాడు.

అమ్మాయి నిరాకరించడంతో ఆమెతో పాటు బస్సు ఎక్కి బస్సులో కూడా వేధింపులకు పాల్పడ్డాడు. జనగామ వచ్చిన తర్వాత ఆమె మొబైల్ ను గుంజుకొని, తనతో రావాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎలాగోలా అతని నుండి తప్పించుకొన్న యువతి పోలీసులని సంప్రదించడంతో సంఘటన జరిగిన 15 నిమిషాలలో లొకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు