నిత్యం భక్తులతో రద్దీగా ఉండే హన్మకొండ లోని వేయిస్థంభాల దేవాలయం… సాయంత్రం 4గంటల సమయంలో కొంత మంది ముష్కరులు దేవాలయంలోకి ప్రవేశించారు, ముష్కరులు దేవాలయంలో డిటోనేటర్లు, బాంబులను అమర్చారు కొందరు భక్తులు, ఆలయ సిబ్బందిని ముష్కరులు బంధించారు. దీన్ని సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఆక్టోపస్ కమోండోలు రంగంలోకి దిగారు. చేతిలో అత్యాధునిక ఆయుధాలు, మాస్కులు ధరించిన ఆక్టోపస్ కమోండోలు రెండు గ్రూపులుగా విడిపోయి దేవాలయంలో ప్రవేశించి చాకచక్యంతో ముష్కరుల చేతుల్లో బందీలుగా వున్న భక్తులు ఆలయ సిబ్బంది ఆక్టోపస్ కమోండోలు సురక్షితంగా విడిపించడంతో పాటు బాంబులను నిర్వీర్యం చేసి ముష్కరులను అంతమొందించారు. ఇదంతా చూస్తున్న ప్రజలు కొద్ది సేపు భయాందోళనకు గురియినారు.

కానీ ఇది నిజంకాదు కానీ నిజంగా అలా జరిగితే ఎలా వుంటుంది ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలి వారిని అడ్డుకోవాలనే తెలిపే ఉద్యేశంతో ఆక్టోపస్ విభాగం అధికారి అనంతయ్య నేతృత్వంలో సుమారు 4 0మంది ఆక్టోపస్ కమాండో బృందం వరంగల్ కమిషనరేట్ పోలీసులతో కలిసి శుక్రవారం వేయిస్థంబాల దేవాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గతంలో దేశంలోని ప్రధాన నగరాలపై ముష్కరులు ఉగ్రదాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఒక వేళ ఉగ్రవాదులు చిన్న నగరాలన్ని లక్ష్యంగా చేసుకోని దాడులకు పాల్పడితే అట్టి పరిస్థితులను ఎలా అదుపు చేయాలనే సూచించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్యేశమని, జనానల్లో చైతన్యం తీసుకరావడం కోసం ఈ మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతాయని. ఇక వరంగల్ పోలీస్ విభాగం కమిషనరేట్ గా మారటంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరింత భద్రత కల్పించడం కోసం మేము సిద్ధంగా వున్నాం అంటూ ప్రజల్లో భరోసా కల్పించడం కోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని అదనపు డి.సి.పి గిరిధర్ తెలిపారు. ఈ కార్య క్రమములో ఆర్.ఐ నగేశ్, హన్మకొండ ఇన్స్‌పెక్టర్ దయాకర్ పాల్గోన్నారు.