హైదరాబాద్‌ : కరోనా సంక్షభ సమయంలో ఉద్యోగం కోల్పోయి కూరగాయలు విక్రయించుకుంటున్న శారదకు సోనూసూద్‌ సాయం చేశారు. సోమవారం ఆమెకు ఉద్యోగ నియామక లేఖను తమ సిబ్బంది అందించినట్లు ఆయన పేర్కొన్నాడు. 26 ఏళ్ల ఉండాది శారదాను కరోనా కారణంగా తన ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడవడానికి కూరగాయలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. శారదకు సాయం చేయాల్సిందిగా రిట్చీ షెల్సన్అనే యువకుడు ట్విట్టర్‌ వేదికగా సోనూసూద్‌ను కోరాడు. “ప్రియమైన సోనూసూద్ సార్ హైదరాబాద్‌కు చెందిన శారదా కరోనా కారణంగా తన ఉద్యోగం నుంచి తొలగించబడింది.

ఆమె తన కుటుంబం కోసం కూరగాయలు విక్రయిస్తోంది. దయచేసి మీరు ఆమెకు ఏమైనా మద్దతు ఇవ్వగలరా ? మీరు ఆమెకు సాయం చేస్తారని ఆశిస్తున్నా’అని ట్వీట్‌ చేస్తూ సోనూసూద్‌కు ట్యాగ్‌ చేశాడు. వెంటనే స్పందించిన సోనూసూద్‌ తన అధికారి ఆమెను కలిశారని. ఆమెకు ఉద్యోగ నియామక లేఖ కూడా అందిందని ఆయన ట్వీట్‌ చేశారు. ‘నేను సోనూసూద్‌ను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. ఆయన చాలా మంది పేదలకు సాయం చేస్తున్నారు. అని శారదా అన్నారు.’ అయితే ఆమెకు ఎలాంటి జాబ్‌ ఆఫర్‌ వచ్చిందో ఆమె తెలుపలేదు.