సద్దుల బతుకమ్మ పురస్కరించుకొని ఈరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా, కురవి లోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుని, పూజలు చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసినప్పటికీ ఆలయ అభివృద్ధి పనులు కొంత నత్తనడకన నడుస్తున్నాయి. దీనిపై త్వరలోనే సమావేశం నిర్వహించి పనులు వేగంగా జరిగేలా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశిస్తాను.

కురవి ఆలయం అభివృద్ధికి ఇచ్చిన నిధులను త్వరగా ఖర్చు చేయడంతో పాటు ఇంకా అవసరమైతే అదనపు నిధులను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర రైతాంగం కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.