మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్ సహా మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించి వడపోసి, గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. 8మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.

నియోజకవర్గం అభ్యర్థి పేరు

మల్కాజ్ గిరి రేవంత్ రెడ్డి
చేవెళ్ల కొండా విశ్వేశ్వరెడ్డి
కరీంనగర్ పొన్నం ప్రభాకర్
జహీరాబాద్ మదన్ మోహన్
ఆదిలాబాద్ రమేష్ రాథోడ్
పెద్దపల్లి ఎ.చంద్రశేఖర్
మెదక్ గాలి అనిల్ కుమార్
మహబూబాబాద్ • బలరాం నాయక్