జనగామ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్ ‌(సినిమా థియేటర్‌) లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. థియేటర్‌ క్యాంటీన్‌లో 60 గ్రాముల పాప్‌కార్న్‌ను రూ.40తో అమ్ముతుండగా.. తక్కువగా వస్తోందని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారి విజయ్‌కుమార్‌ నేతృత్వంలో తనిఖీలు చేసి.. క్యాంటిన్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. 60 గ్రాముల పాప్‌కార్న్‌లో 15 గ్రాములు తక్కువగా వస్తోందని గుర్తించి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారి తెలిపారు. నిర్దేశిత ధరల కంటే అదనంగా అమ్మినా, తూకంలో మోసం చేసినా కఠిన చర్యలు ఉంటాయని విజయ్‌ కుమార్‌ హెచ్చరించారు.