విద్యార్థులు వేసుకునే స్కూల్‌ యూనిఫాంనే తానూ కుట్టించి ధరించాడు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్‌.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇదే జరిగింది. ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూల్ యూనిఫామ్ లో పాఠశాలకు రావడంతో విద్యార్థులు అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏకంగా స్కూల్ విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ సొంతంగా కొట్టించుకొని మరి ఆ ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ యూనిఫామ్ ధరించాడు. అయితే ఈ ప్రధానోపాధ్యాయులు స్కూల్ యూనిఫామ్ ధరించింది కేవలం సరదా కోసం కాదు, బుధ, శనివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో యూనిఫాం వేసుకుని వస్తానని తెలిపిన ప్రధానోపాధ్యాయుడు కోడిపాక రమేష్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

విద్యార్థుల్లో విద్యార్థిగా కలిసిపోయి స్నేహితుడిలా మరి వారికి పాఠాలు బోదిస్తాను అని చెబుతున్నాడు ఈ ప్రధాన ఉపాధ్యాయుడు. విద్యార్థులతో కలిసి పోయి విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేష్ చెప్పుకొచ్చారు. ఇక మధ్యాహ్న సమయంలో కూడా విద్యార్థుల పక్కనే కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు ఈ ఉపాధ్యాయుడు. ఇక ఈయన తీరు చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోవటమె కాదు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఒక గురువుగా విద్యార్థులకు విద్యను బోధించడం పట్ల ఆయనకున్న పట్టుదలను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.