వరంగల్: స్మార్ట్ సిటీలో భాగంగా చిన్నపిల్లలు, సంరక్షకులు, కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్మార్ట్ సిటీ మిషన్ జాయింట్ డైరెక్టర్ రాహుల్ కపూర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన న్యూ ఢిల్లీ నుండి దేశంలోని 10 స్మార్ట్ సిటీ సిఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విసిలో బల్దియా కమీషనర్ పమేలా సత్పతి, స్మార్ట్ సిటీ పీఎంఈ పాల్గొన్నారు.