హన్మకొండలో లాక్ డౌన్ కారణంగా 45 రోజులుగా మూసివున్న కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శుభ్రం చేసేందుకు షాపింగ్ మాల్‌ను తెరవగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

దీంతో సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మొత్తం ఐదు ఫ్లోర్లలో కోట్ల రూపాయల ఆస్తి ఉందని షాపు యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.