హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. కాపాడాల్సిన తండ్రే మానవత్వం మరిచి కన్న కూతూరిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే: వరంగల్‌ జిల్లా తొర్రురుకు చెందిన కుమారస్వామి వృత్తి రిత్యా కారుడ్రైవర్‌. కుటుంబంతో కలిసి హన్మకొండలోని KLN‌ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న కుమారస్వామికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు . ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున చిన్న కూతురుపై లైంగాక దాడికి పాల్పడుతుండగా పెద్దకూతురు చూసి తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని హన్మకొండ పోలీసులకు తెలపడంతో కుమారస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మూడు నెలలుగా కూతురిపై కామవాంచ తీర్చుకుంటున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది…