హనుమకొండ చౌరస్తా: స్నేహ బార్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఓ ఇన్నోవా కారులో మృతదేహం ఉండడం కలకలం రేగింది. మృత దేహం చూసిన అక్కడివారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హనుమకొండ, పెద్దమ్మగడ్డకు చెందిన వ్యక్తి మృతదేహంగా అనుమానిస్తున్నారు. ఇది సహజ మరణమా.? లేక హత్య అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ కారు రాత్రి నుంచి ఉన్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం షాపులు తెరవడానికి వచ్చిన వారు కారులో మృత దేహం ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.