ఈ నెల 7 వ తేదీన దేశ ప్రధాని నరేంద్రమోదీ గారితో కలిసి బెంగుళూర్ లో చంద్రయాన్ – 2 మూన్ లాండింగ్ ను వీక్షించే అవకాశం దక్కించుకున్న మాస్టర్ కలికోట పార్ధీవ్ కు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అభినందనలు తెలియచేసారు. హన్మకొండలోని ఎమ్మెల్యే గారి నివాసంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారిని పార్ధీవ్ కుటుంబసభ్యులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్ధీవ్ తో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు భారత అంతరిక్ష విభాగం వారు నిర్వహించిన జాతీయ స్థాయిలో ఆన్లైన్ పరీక్ష చేపట్టిన విధానాన్ని పార్ధీవ్ ని అడిగి తెలుసుకున్నారు. ఇస్రో నిర్వహించిన జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పార్ధీవ్ కి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలని అన్నారు.