వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా ప్రభావితమయ్యే ప్రాంతాలలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు . ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో కొవిడ్ – 19 వ్యాప్తి నివారణ చర్యలపై వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు . జిల్లాలో మహిళా సంఘాల ద్వారా మాస్కుల తయారీని ప్రోత్సహించాలన్నారు .

కలెక్టర్ మాట్లాడుతూ: వరంగల్ అర్బన్ జిల్లాలో 15 కరోనా ప్రభావిత ప్రాంతాలను నో మూమెంట్ జోన్లుగా ప్రకటించామని, ఇంటింటికి సర్వే కోసం 450 బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు 32 వేల ఇళ్ల సర్వే పూర్తయిందని మిగతావి సోమవారంలోగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు .