వరంగల్ ఎంజీఎంలో అదృశ్యమైన బాలుడు యశ్వంత్ ఆచూకి లభ్యమైంది. వరంగల్ బస్టాండ్ ప్రాంగణంలో యశ్వంత్ ఆచూకీని మట్టేవాడ పోలీసులు గుర్తించారు. ఏడేళ్ల బాలుడు యశ్వంత్‌ను పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం యశ్వంత్ ఎంజీఎం ఆస్పత్రికి ఓపీ కోసం వచ్చి తల్లి ఓపీ కార్డు తీసుకురావడానికి వెళ్లగానే అక్కడి నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే.