{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1597814345285","source":"other","origin":"gallery","sources":["274130406034211"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1601028361436"}

అక్టోబర్ 1వ తేదీ నుంచి చేపట్టనున్న పట్టభద్రుల ఓటర్ నమోదును విరివిగా చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. వరంగల్ 20వ డివిజన్ రైల్వేగేట్ శాంతినగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో రాజశ్రీ గార్డెన్ లో జరిగిన మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ ను ఛాంబర్ ఆఫ్ మార్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు హాజరై తిలకించారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు అవకాశాలు కల్పించేంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, 1వ తేదీ నుంచి పట్టభద్రులను తమ ఓటర్ నమోదు చేసుకునేలా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ నాయకులు సూచించారు.

అర్హులు ఓటరు నమోదు చేసుకోవాలి:

రామన్నపేట: టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పట్టుభద్రుల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటు హక్కు నమోదు చేసుకునేలా కృషి చేయాలని 24డివిజన్ కార్పొరేటర్ గుండు అశ్రిత విజయ్ రాజు పిలుపు నిచ్చారు. గురువారం రామన్న పేటలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు ఉత్సహంగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. నాయకులు సదాంత్, కుమారస్వామి, శ్రీనివాస్, చంద్రమౌళి, క్రాంతి, ముఖేష్ పాల్గొన్నారు.