మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇళ్లంతా బంధువులతో సందడిగా ఉంది. వధూవరులు, తమ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. మరికొద్ది గంటల్లో వారు ఏడడుగులు, మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు. అలాంటి సమయంలో, వారి జీవితంలో ఓ పిడుగుపడింది. వరుడి ఫోన్ కి వచ్చిన ఒక్క వీడియో వారి జీవితాలను తలకిందులు చేసింది. ఎవరో వరుడి ఫోన్ కి వాట్సాప్ లో ఓ వీడియో పంపగా అది చూసిన వరుడు షాకయ్యాడు. తనకు ఈ పెళ్లి వద్దంటే వద్దు అని కూర్చున్నాడు. ఈ సంఘటన వారణాసిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, సరిగ్గా తెల్లారితే పెళ్లనగా, యువకుడికి, పెళ్లికూతురికి సంబంధించిన ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి వరుడు షాకయ్యాడు. అది పోర్న్ వీడియో కాగా, అందులో తాను పెళ్లి చేసుకోబోయే యువతి ఉండటం గమనార్హం. వరుడు వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో పాటు, యువతి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. అంతే కాకుండా తాను ఈ పెళ్లి చస్తే చేసుకోనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. కాగా, యువతి దీనంతటికీ తన అక్క వాళ్ల బంధువులే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గతంలో యువతి అక్కకి పెళ్లి జరగగా, ఆమె బావ తరచూ వాళ్ల ఇంటికి వచ్చే వాడు.

ఆ సమయంలో తన బావ బంధువుతో సదరు యువతికి పరిచయం ఏర్పడింది. సదరు బంధువు యువతికి తెలియకుండా ఆమె నగ్న వీడియోలను ఫోటోలను చిత్రీకరించాడు. ఇప్పుడు వాటిని ఏకంగా వరుడికి పంపి, పెళ్లి ఆగిపోయేలా చేశాడు. దీంతో, యువతి, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సదరు వ్యక్తి పెళ్లి కొడుక్కి ఆ ఫోటోలు , వీడియోలు ఎందుకు పంపాడు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.