వివాదాస్పద డైరెక్టర్​ రాంగోపాల్​ వర్మపై అమృత మండిపడ్డారు. అమృత, ప్రణయ్​ ప్రేమ కథ, అమృత నాన్న మారుతీరావు ఇతివృత్తంగా సినిమా తీయనున్నట్లు ఫాదర్స్​ డే సందర్భంగా ఆర్జీవీ అనౌన్స్​ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై అమృత సోషల్​ మీడియా వేదికగా స్పందించారు. ‘మిస్టర్​ వర్మ, మీకు ఆడవాళ్ల గౌరవం గురించి చెప్పే తల్లి లేనందుకు చింతిస్తున్నాను. రెస్ట్​ ఇన్​ పీస్​” అని పేర్కొన్నారు. ‘‘వర్మ చేసిన ప్రకటనతో మళ్లీ మా జీవితంలో అలజడి మొదలైంది. నా భర్త ప్రణయ్ హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము భయం భయంగానే బతుకుతున్నం. ఇప్పుడు మా జీవితాన్ని సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించడం కొత్త సమస్యగా మారింది” అని పేర్కొన్నారు. ‘‘ నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులకు తప్ప నా జీవితం గురించి ఎవరికీ తెలియదు. వర్మ సినిమాలో ఎలాంటి వాస్తవం ఉండదని” అని కొట్టిపారేశారు. తండ్రిలేని తన బిడ్డతో తాను సాధారణ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానని, అలానే బతకనివ్వండి అని కోరారు. వర్మపై తాను కేసు పెడితే మళ్లీ అది ఆయనకే ప్రచారంగా మారుతుందని, అందుకే కేసు పెట్ట దలచుకోలేదని అన్నారు.