లాక్​డౌన్​ నేపథ్యంలో ఉపాధి లేక ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు, నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. దారిలో దాతలు ఇచ్చిన ఆహారం, నీళ్లు తాగుతూ పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ సైతం కార్మికులకు ఆసరాగా నిలాచాడు.దాతృత్వంలో ముందుండే మాజీ క్రికెటర్​ వీరేందర్ సెహ్వాగ్​, మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్న వలసకూలీలకు ఆహార పొట్లాలను అందించాడు. తన కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే ఆహారం తయారుచేయగా, సెహ్వాగ్​ స్వయంగా ప్యాకింగ్​ చేశాడు. కార్మికులు తింటున్నప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. తన అభిమానులూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరాడు.”ఇంట్లో తయారు చేసి, ప్యాకింగ్​ చేసి కూలీలకు ఇస్తే చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి అభిమాని ఇలా 100 మందికి సాయం చేసి ఆ ఫొటోలను నాకు సోషల్​మీడియాలో పంపించండి” అని సెహ్వాగ్ పోస్ట్ చేసారు