వినియోగదారుల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ అప్ డేట్ ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్ లలో వాట్సాప్ వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఫోన్ ఆఫ్ లో ఉన్నా వాట్సాప్ వాడుకునే వీలు కల్పించింది. అంటే ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా కనెక్టెడ్ డివైజ్ ల్లో మామూలుగానే చాట్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా ఫోన్ ఆఫ్ లో ఉన్న మెసేజ్ లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ అవుతాయని వాట్సాప్ తెలిపింది. వీటితో పాటు వేరే డివైజ్ లకు వాట్సాప్ ను త్వరగా కనెక్ట్ చేయడానికి విండోస్ యూజర్స్ కోసం కొత్త యాప్ ను తీసుకొచ్చినట్లు మెటా తెలిపింది. ఈ యాప్ ద్వారా స్పీడ్ గా లోడింగ్, ఫాస్ట్ ఇంటర్ ఫేస్, ఫాస్ట్ చాటింగ్ ఎక్స్ పీరియన్స్ పొందొచ్చు.