తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడ్డాయి. శుక్రవారం దాదాపు 500 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 499 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు చనిపోయారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 129, జనగాంలో 7, మహబూబ్ నగర్‌ లో 6, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండ, వరంగల్-U, నిజామాబాద్‌లో 4 చొప్పున, ఖమ్మం, సూర్యాపేటలో 2 చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6525 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3352 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 198 మంది మరణించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 2976 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.