వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా అందులో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులు పోలీసులకు పట్టుపడ్డారు. అంత చిన్న వయస్సులోనే వాళ్లు వ్యభిచారం రొంపిలోకి దించి, ఈ వ్యవహారం నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి భార్యతో పాటు విటులుగా మారిన ఇద్దరు విద్యార్థినులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నల్గొండ పోలీసులు ఇలా తెలిపారు. నల్లగొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమచారంతో నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు దాడి చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశారు.

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో డిగ్రీ విద్యార్థినులు, ఇంటర్ విద్యార్థినులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్లను సఖి కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉందని. ఆమె ఇటీవల తన భర్తతో గొడవపడి విడాకులు తీసుకుందని తర్వాత ఆమె విటురాలుగా మారిందని పోలీసులు తెలిపారు. కాగా రమేష్‌చారి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటువంటి వ్యభిచార గృహాలు నిర్వహించడం నేరమని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.