తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాజీపేట ఫాతిమా జంక్షన్లో గ్రేటర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘వావ్ వరంగల్’ ! అన్న స్లోగన్ తో వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు . దీన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ , చీఫ్ విప్ వినయభాస్కర్ , మేయర్ గుండా ప్రకాశ్ రావు , కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , మేయర్ పమేల సత్పతి ప్రారంభించారు . కానీ, వాటర్ ఫాల్స్ మూన్నాళ్ల ముచ్చటగానే నడిచి ఆగిపోయింది. ఇదిలా ఉంటే అక్కడి జంక్షన్లో రోడ్డు కూడా గుంతలమయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి…