తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం(22వ తేదీ) తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించిన విషయం తెలిసిందే. వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ అదే రోజు గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3వేల మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే, పంక్తి భోజనం చేసే సమయంలో కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన ఆకుల ఆగవ్వ అనే మహిళ అస్వస్థతకు గురయ్యారు.

సీఎంతో భోజనం చేసిన రోజు రాత్రే ఆగవ్వ అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆమెను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్య చికిత్సల అనంతరం ఆగవ్వ ఈరోజు తిరిగి వాసాలమర్రికి చేరుకున్నారు. అయితే, కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన సమయంలో ఆగవ్వను తన దోస్త్ అని కేసీఆర్ అనడం విశేషం.