విజయశాంతి ఇప్పుడు ఏదైనా సినిమాలో నటించాలి అంటే ఆమెకు సమానమైన పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించాలంట. చిన్న చితక హీరోలు యాంగ్ హీరోల సినిమాలైతే అసలు కథే వినను అని చెప్పేస్తుందట.

అంతేకాదు, ఏ హీరోతో అయితే ఆమె నటిస్తుందో.ఆ హీరోకు ఉండే అన్ని సౌకర్యాలు ఆమెకు ఉండాలంట. ఇంతేకాదు ఇంకా ఉన్నాయి. అవి ఏంటి అంటే సినిమా ప్రేమోషన్స్ లో ఆమె కూడా ప్ర‌ముఖంగా క‌నిపించాల‌ని, ముఖ్యంగా పోస్ట‌ర్ల‌లో హీరోతో పాటు స‌మాన‌మైన ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆమె కోరుతుంది.

అంతే కాదు ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి ముందు ఎంత చెబితే అంతే ఉండాల‌ని, తీసిన సన్నివేశాలు ఒక్క‌టీ తొల‌గించ‌కూడ‌ద‌ని చెబుతోంద‌ట‌. ఇప్పుడు చెప్పిన ష‌ర‌తుల‌న్నింటికీ ఒప్పుకుంటే అప్పుడు క‌థ వింటుంద‌ట‌. కథ నచ్చితే సినిమాలో ఆమె అడిగే పారితోషికం ఇవ్వాలని, అయితే ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆమె షరతులే దారుణంగా ఉన్నాయని అవి ఒప్పుకోవాలంటేనే కొంచం కష్టంగా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్. మరి చివరికి ఎం అవుతుందో చూడాలి…