పర్యాటకుల స్వర్గం గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. దక్షిణ గోవాలో విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. గోవా పోలీసులు వ్యభిచార రాకెట్టును ఛేదించారని దక్షిణ గోవా పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. గోవాలోని కొల్వా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ రాకెట్టును ఛేదించారు. నిందితుడు, 37 ఏళ్ల విజయ్ సింగ్, మధ్యప్రదేశ్ కు చెందినవాడు కాగా, గత 15 సంవత్సరాలుగా గోవాలో నివసిస్తున్నాడని ఎస్పీ సింగ్ చెప్పారు.

విదేశాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి బీచ్ లో ఉన్న గెస్ట్ హౌస్ కేంద్రంగా వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు బాలికలను రక్షించినట్లు ఆయన తెలిపారు. ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు అని ఆయన అన్నారు. బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మహిళా సదనానికి తరలించారు.