తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికి పెరిగి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలుస్తోందని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ ప్రాంగణంలోనీ (యస్ పి డి యస్ ఎల్) కార్యాలయంలోనీ తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్కో & జెన్కో CMD దేవులపల్లి ప్రభాకర్ రావు, SPDCL CMD రఘుమారెడ్డి,తో పాటు NPDCL CMD గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికి సరఫరాలో అంతరాయం కలుగకుండా అందించాలని అధికారులను ఆదేశించారు.